తెదేపా దీక్షలకు సీపీఎం మద్దతు

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యలపై పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెదేపా ప్రజాప్రతి నిధులు చేపట్టిన దీక్షలకు సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. దీక్షాస్థలికి ఆయన ఈ ఉదయం వచ్చి పరామర్శించారు. మరోవైపు నిరవధిక దీక్షలో తెదేపా ఎంపీ గుండుసుధారాణితో పాటు పలువురు ఈ ఉదయం పాల్గొన్నారు.