తెదేపా నేత కోడెల శివప్రసాద్‌రావుపై చేయి చేసుకున్న పోలీసులు
గుంటూరు: సహకార సంఘాల ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆందోళనకు దిగిన తెదేపా నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావుపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనకు సపర్యలు చేశారు. అనంతరం పోలీసుల దాడిని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.