తెదేపా పొలిట్‌బ్యూరోకు అయ్యన్న పాత్రుడు రాజీనామా

విశాఖ: తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి ఆ పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా కార్యకర్తగా మాత్రమే పనిచేస్తానని అన్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. తనకు అవకాశాలు కల్పించినందుకు ఆయన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పీళా శ్రీనివాసరావును ఏకపక్షంగా సస్పెండ్‌ చేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు. ఈ చర్యను ఆయన ఖండించారు.