తెదేపా బృందంతో మాట్లాడుతు క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయిన సీఎం

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యపై తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఈరోజు సాయంత్రం సీఎంను సచివాలయంలో కలిసింది. గ్యాస్‌ విద్యుత్‌ సమస్యను ఎలా ఆధిగమించాలని ముఖ్మమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వారిని ప్రశ్నించారు. తెదేపా బృందంతో మాట్లాడుతూనే సీఎం మధ్యలో క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. దాంతో తెదేపా నేతలు సీఎం సమావేశమందిరంలోనే భైఠాయించి నిరసన తెలుపుతున్నారు.