తెరాసలో చేరిన స్వామిగౌడ్
హైదరాబాద్: టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వామిగౌడ్‌ను ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్ భారీ మెజారిటీతో గెలుపోందుతారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.