తెరాస నేతల ధ్వజం

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కేసులు నమోదు చేయాలన్న పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌పై తెరాస నేతలు మండిపడ్డారు. ప్రజాసమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మోల్యేలను అడ్డుకున్నందుకు పోలీసులపైనే కేసులు పెట్టాలన్నారు. గతంలో పోలీసులపై ఇష్టారాజ్యంగా వ్వవహరించిన మంత్రి దానం, టీజీ వెంకటేశ్‌, అసదుద్దీన్‌ ఒవైసీ వంటి వారిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తెరస నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, నిరంజన్‌రెడ్డిలు ఈ రోజు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.