తెలంగాణతల్లికి కెసిఆర్‌ నివాళి

హైదరాబాద్‌,అక్టోబర్‌25 (జనంసాక్షి): నగరంలోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ప్లీనరీ వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి కేసీఆర్‌ నివాళులర్పించారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. వేదికపై ఆశీనులైన సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి మహముద్‌ అలీ దట్టీ కట్టారు. టీఆర్‌ఎస్‌ నాయకులతో హైటెక్స్‌ నిండిపోయింది.