తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతాం:కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద కేటీఆర్ కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ యువతకు ఉపాధి కల్పించేందుకు అమెరికా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించామని తెలిపారు. అమెరికా పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో.. రూ.3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.