తెలంగాణపై బీజేపీ మాట తప్పింది: సీపీఐ
హైదరాబాద్: తెలంగాణ ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చిన బీజేపీ మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ అన్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని నమ్మబలికి తెలంగాణ ప్రజలను బీజేపీ వంచించిందని విమర్శించారు, తెలంగాణపై టీడీపీ, కాంగ్రెస్‌లది రెండు నాల్కల ధోరణి అని ఆయన విమర్శించారు. సీపీఐ పార్టి అన్ని సమస్యలపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.