తెలంగాణపై స్పష్టత ఇవ్వాలి

హైదరాబాద్‌: కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ డిమాండ్‌ చేశారు. చిందబరానికి తమిళనాడులోనూ ఆజాద్‌కు కాశ్మీర్‌లోనూ దిక్కు లేదని విమర్శిచిన ఆయన వాళ్లిద్దరూ ఇక్కడకొచ్చి ఆంద్రప్రదేశ్‌తో మాత్రం ఆటలాడుకుంటున్నారని ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా తన కుర్చీని కాపాడెకోవడంపై ఉన్న శ్రద్ద సమస్యలపై లేదని మండిపడ్డారు. అసందర్భంగా రాయన తెలంగాణ ప్రతిపాదనను తెరపైకా తేవడం వేనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించిన తలసాని ఇటీవల ఉప ఎన్నికల్లో ఓటమి పాలవగానే ఈ వ్వవహరాలన్నీ తెరపైకా ఎందుకు వస్తున్నాయని కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను నిరసిస్తూ త్వరలో మేధావులు, విద్యార్థులతో కలిసి చలో డిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీయల తెలుగుదేశం పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారన్న వార్తలపై ప్రశ్నించగా తాను పార్టీ మారుతున్నానని ఎవరు చప్పారని ఆయన ఎదును ప్రశ్నించారు. తెలంగాణ అంశన్ని ఇంకా నాన్చడం తగదని. తక్షణం తేల్చాలని డిమాండ్‌ చేశారు.