‘తెలంగాణమార్చ్‌ మేడారం జాతరను తలపించాలి’

మహబూబ్‌నగర్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ సడిగడ్డ మీద ఒక మేడారం సమ్మక్క-సారక్క జాతరను మరిపించేంట్లుగా ‘ తెలంగాణ మార్చ్‌’ను విజయవంతం చేయాలని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొజ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్‌’ను విజయవంతం చేయటానికి రేపటి నుండి 15వ తేదీ వరకు సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

జనజాతరలా జరిగే తెలంగాణ మార్చ్‌లో ఈ గడ్డ మీద పుట్టిన ప్రతిబిడ్డా చేతిలో జెండా, గుండెలో ఉప్పొంగిన కదనోత్సహంతో పాల్గొని సీమాంధ్ర ప్రభుత్వాన్ని ధిక్కరించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకే తెలంగాణ మార్చ్‌ను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అస్తిత్వ సమస్య అని, అస్తిత్వమే కోల్పోతున్నప్పుడు పోరాటాలు  ఏ రూపమైన  తీసుకుంటాయని ఆయన తెలియజేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత సుదీర్ఘకాలంగా నాలుగు కోట్ల ప్రజాసమూహ ఆంకాంక్షను పాలకులు పట్టించుకోక పోవటం దుర్మార్గమన్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్ర పెట్టబడిదారులు తెలంగాణ ప్రజల ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు.