తెలంగాణలో ఉనికి కోల్పోతున్నా కాంగ్రెస్‌, టీడీపీ

ఎల్లారెడ్డిపేట: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌, తెదేపాలు ఉనికిని కోల్పోతున్నాయని ఇటీవల జరిగిన పరికాల ఉప ఎన్నికల ఫలితాలే అందుకు  నిదర్శనమని సిరిసిల్ల  ఎమ్యెల్యే కె. తారకరామారావు చెప్పారు. కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేల మాటలను  తెలంగాణ ప్రజలు విశ్వసించే  పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తారా లేదా పార్టీనీ వీడతారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అంశంపై కేంద్ర సర్కారు తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పోరాడాలని  కేటీఆర్‌  తెలియజేశారు.