తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో ఎక్కడిక్కడ బస్సులు నిలిచిపోయాయి. కార్మికుల సమ్మెకు ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ, ఎస్ డబ్ల్యుఎఫ్, బహుజన కార్మిక యూనియన్‌తో పాటు పలు సంఘాలు మద్దుతు ఇచ్చాయి. మరోవైపు బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
డిపోలకే పరిమితమైన బస్సులు….
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. అర్థరాత్రి నుంచి ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ కార్మిక సంఘాలు పూర్తిస్థాయిలో సమ్మెబాటపట్టాయి. రాత్రి నుంచే దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కార్మికుల సమ్మె కారణంగా హైదరాబాద్ జంటనగరాల్లోని 17 డిపోల్లో 3,800 బస్సులు.. వరంగల్ జిల్లా పరిధిలోని 9 డిపోల్లో 951 బస్సులు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 9 డిపోల్లో 893 బస్సులు, నల్లగొండ జిల్లాలోని 7 డిపోల్లో 750 బస్సులు నిలిచిపోయాయి. అటు కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల్లో 920 బస్సులు.. నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోల్లో 669 బస్సులు, మెదక్ జిల్లాలోని 6 డిపోల్లో 669 బస్సులు.. ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల్లో 560 బస్సులు నిలిచిపోయాయి. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్సు డిపోల ఎదుట కార్మికులు బైటాయించి ఆందోళన చేస్తున్నారు.
నగరంలో….
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో నిలిచిన 3800 బస్సులు, వరంగల్ జిల్లాలో 951, మహబూబ్ నగర్ జిల్లాలో 893, నల్లగొండ జిల్లాలో 750, కరీంనగర్ జిల్లాలో 920,నిజామాబాద్ జిల్లాలో 669, మెదక్ జిల్లాలో 669, ఖమ్మం జిల్లాలో 560 బస్సులు డిపోలకే పరిమిత
ఖమ్మం జిల్లాలో….
ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. విధులు బహిష్కరించిన 3200 కార్మికులు బస్సులు డిపోనుంచి బయటకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి ఉత్తమ్ మరిన్ని వివరాలు అందిస్తారు.
మహబూబ్ నగర్ జిల్లాలో….
మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉద్ధృతమైంది. సమ్మె ప్రభావంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. అక్కడి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు.
కరీంనగర్ జిల్లాలో….
కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎదుట కార్మికులు ఆందోళణ చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు.
మెదక్ జిల్లాలో….
మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. విధులు బహిష్కరించిన కార్మికులు ఆందోళన బాట పట్టారు. డిపోల నుంచి బస్సులు బయటకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి యాదగిరి మరిన్ని వివరాలు అందిస్తారు.
నల్లగొండ జిల్లాలో…
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో నల్లగొండ జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 7 డిపోలకు సంబంధించి 700 బస్సులు నిలిచిపోయాయి. 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచుతామనడం సమంజసం కాదని.. కార్మికనేతలు ఫైర్ అయ్యారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి ఆర్టీసీ ఉన్నతాధికారులే కారణమన్నారు. ఇదే అంశంపై మాప్రతినిధి శేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు.