తెలంగాణలో పెరగుతున్న ఎండలు

హైదరాబాద్‌,మార్చి26 (జ‌నంసాక్షి): తెలంగాణ జిల్లాలో  ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. వరుసగా ఏరోజుకారోజు ఉష్ణోగ్రతలు పెరుతుండటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నల్గొండ నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, రామగుండం, కరీంనగర్‌లో  ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడం కోసం బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌,కరీంగనర్‌, ఖమ్మం, వరంగల్‌ కోల్‌బెల్ట్‌ ఏరియాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దీంతో గనుల్లో బొగ్గు కోసం వెళ్లే కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పుడే ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. దీనిరకితోడు పరీక్షల కాలం ఆవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఎండల కారణంగా కార్మికులు ఇబ్బందుల పడుతున్నారు. మధ్యాహ్నం రోడ్లుపై జనసంచారం తక్కువగా ఉంటోంది.  ఇక నిజామాబాద్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎండలు ఇకముందు మరింతగా పెరుగుతాయని అధికారులు అంటున్నారు. ఎండలో వెళ్లాల్సి వస్తే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిడాక్టర్లు సూచిస్తున్నారు.