తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమే: స్వామిగౌడ్‌

హైదరాబాద్‌: తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమేనని జేఏసీ నేత స్వామిగౌడ్‌ హెచ్చరించారు. మార్చ్‌కు అడ్డంకులు సృష్టిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణవాదుల పట్ల ప్రభుత్వం నీజాతినీతిగా ప్రవర్తిస్తున్నదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చ్‌కు అనుమతిచ్చి అరెస్టులు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ కుటిల నీతికి అరెస్టులే నిదర్శనమని ధ్వజమెత్తారు.