తెలంగాణ అంశంపై అధిష్ఠానాన్ని కలుస్తాం: డీకే అరుణ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై చర్చించేందుకు మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో కలసి దేశరాజధానికి వెళ్లి కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కలుస్తామని మంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ప్రజాప్రతి నిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆమే మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులపై ఉన్న విశ్వాసం వల్లనే తెరాస జిల్లాలో ఎదగలేకపోయిందని అన్నారు.