తెలంగాణ అంశంపై భేటీ కానున్న తెదేపా

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై స్పష్టతకోసం సోమవారం సమావేశమై చర్చించాలని తెదేపా నిర్ణయించినట్లు సమాచారం. శనివారం చంద్రబాబు నాయుడు తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తెలంగాణపై లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది సీమాంధ్రనేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రాజకీయంగా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకే లేఖ అంశాన్ని ప్రచారంలోకి తెస్తున్నారని బాబుకు చెప్పినట్లు సమాచారం. ఈ అంశంతో పాటు అక్టోబర్‌ 2 నుంచి తలపెట్టనున్న పాదయాత్రపై కూడా చర్చ జరిగింది. యాత్ర చేపట్టాల్సిన రూట్‌ మ్యాప్‌, యాత్రకు పెట్టాల్సిన పేరు వంటి అంశాలను ప్రధానంగా చర్చించారు.