తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర అవతరణ దినోత్స వేడకలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ఆవరణలో వున్న గాంధీ విగ్రహానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ…అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరే పలు కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది కాలాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే బంగారు తెలంగాణ సాధ్యం అని పేర్కొన్నారు.