తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర సర్కారు వైఖరికి నిరసనాగా కదంతొక్కిన జనంసాక్షి

 తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర దురహంకారం వైఖరికి నిరసనగా నగరంలో జనంసాక్షి కాదంతొక్కింది ప్రధాని పర్యటన సందర్భంగా  తెలంగాణ మీడియాను అనుమంతించాకుండా వివక్ష చూపడంపై సీమాంధ్ర సర్కారు అప్రజస్వామికాంగా వ్యవహరించిందని మండిపడింది.  ఈసందర్భంగా జనంసాక్షి కార్యలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన సిబ్బంది తెలంగాణ చీక్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద మానవహరి  నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి సీమాంధ్ర సర్కారు డౌన్‌డౌన్‌అంటూ నినాదాలు చేశారు. అనంతరం జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ లోని ఏవోని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర సర్కారు వైఖరి హేయమైనదని ఇది అప్రజస్వామికం అంటూ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జనంసాక్షి సిబ్బంది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సభ్యులు పాల్గొన్నారు.