తెలంగాణ జేఏసీ నేతలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంపై చర్చించేందుకు తెలంగాణ జేఏసీ నేతలతో టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈనెల 2న జరుగబోయే అఖిలపక్ష సమావేశంతోపాటు, తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై వారు ప్రధానంగా చర్చించనున్నారు.