తెలంగాణ మహాధర్న ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్న ప్రారంభమైంది. ధర్నలో స్వామిగౌడ్‌, అడ్వకేట్‌ జేఏసీ నాయకులు, పొలిటికల్‌ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ మాట్లాడుతూ జయశంకర్‌ సార్‌ ఆశయాలకు అనుగుణంగా స్వయం నిర్ణయాధికారంగా ఎదిగి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటామని తెలిపారు.