తెలంగాణ మార్చ్‌కు ప్రజాఫ్రంట్‌ మద్దతు

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు మద్దతు ఇవ్వలాని కోరుతూ తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఈ రోజు తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నేతలను కలిశారు. ప్రజాఫ్రంట్‌ కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షుడు వేదకుమార్‌ను కలిసి తెలంగాణ మార్చ్‌కు సంఘీభావం తెలిపాలని కోరారు. ఉద్యమంలో తెలంగాణ మార్చ్‌ కీలక ఘట్టమని చెప్పారు. ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు వేదకుమార్‌ స్పష్టంచేశారు.