తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుంది:కేసీఆర్‌

ముంబాయి: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ కార్యలయంలో మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పాటవుతుందని తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఈ మెరకు నాకు సంకేతాలందతున్నాయని అన్నారు. కార్మీకుల సమస్యలు పరిష్కారించడానికి శాసనసభ్యులు చోరవచూపాలని ఆయన అన్నారు. టీబీజీకెఎస్‌ ను సింగరేణి కార్మికులు గెలిపించినందుకు నా పక్షణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. రూ కోట్లలో లాభాలు వస్తున్న కార్మీకులకు మాత్రం కనీస వసతులు కల్పించటం లేదని విమర్శించారు. మరో 30,40వేల మంది కార్మీకులను చేర్చుకుందామని అన్నారు. టీబీజీకెఎస్‌ పేరు మీదా ఒక కారు కొనాలని సూచించారు. తెలంగాణ వచ్చినాక సింగరేణిలో ప్రభుత్వం తరపు పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు. కార్మీకలకు ఏ బాధ వచ్చిన పంచుకోవాలని తెలంగాణ కోసం పోరాడేదే టీఆర్‌ఎస్‌ అని అన్నారు. నేడు టీఆర్‌ఎస్‌ హిమాలయ పర్వతం ఎత్తు ఎదిగిందని అన్నారు.