తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం పరితపించిన వ్యక్తి కాళోజీ.
– గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ.
పోటో: కాళోజీ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న సర్పంచ్.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 9, (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం పరితపించిన వ్యక్తి కాళోజీ అని బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ అన్నారు. శుక్రవారం కాళోజీ శత జయంతి వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఏవిధంగా దోపిడీకి గురైందో ప్రజలకు అర్థమయ్యేలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కోసం ఎదురు చూసిన మహావ్యక్తి అన్నారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ నారాయణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, వార్డు సభ్యులు ఉమాదేవి, గంగమల్లు, పంచాయతీ కో అప్షన్ సభ్యుడు చింత విగ్నేష్, ఐకేపీ వివోఏ అనిల్, యూత్ సభ్యులు సురేష్, పొశం రవి, తిరుపతి, రాజేష్, అశోక్ పాల్గొన్నారు.