తెలంగాణ వచ్చుడు ఖాయం : ఎమ్మెస్సార్‌

హైదరాబాద్‌,జూలై 29 (జనంసాక్షి) : కాస్త ఆలస్యమైనా తెలంగాణ రావడం ఖాయమని ఆర్టీసీ చైర్మన్‌ ఎంఎస్‌ఆర్‌ అన్నారు. గత కొంత కాలంగా మౌనంగా ఉన్న ఎంఎస్‌ తెలంగాణపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. కాస్త ముందో వెనకో అవుతుంది కానీ తెలంగాణ రావడం మాత్రం ఖాయమని ఆయన తెలిపారు. సీనియర్లంతా అదిష్టానంతో మాట్లాడుతున్నారనీ..దీనిపై అధినాయకత్వానికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అధిష్టానానికి ఎపుడు ఏం చేయాలో తెలుసని అనవసరంగా తెలంగాణ నేతలు తలో రకంగా మాట్లాడి ప్రజలను గందరగోళానికి గురిచేయ వద్దన్నారు. తెలంగాణపై సంకేతాలు వస్తున్నాయన్న కొందరి మాటాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన కేసీఆర్‌ను ఉద్దేశ్యించి అన్నారు. ఆది నుంచి లగడపాటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతన్నాడని ఆయన్ను నిందిచాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.