తెలంగాణ వాదం వచ్చినప్పుడల్లా ఇతర ప్రాంతాల డిమండ్లు తెరపైకి తేవడం సరికాదు: తెరాస

హైదాబాద్‌: తెలంగాణ వాదం ముందుకు వచ్చినప్పుడల్లా ఇతర ప్రాంతల డిమాండ్లు తెరపైకి తేవడం సరికాదని తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు అన్నారు. రాయలసీమ రాష్ట్రం అంటూ మాట్లాడుతున్న తెదేపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వీలినం కాకముందు రాష్ట్రాన్నే డిమాండ్‌ చేయాలని జూపల్లి సూచించారు. తామేమి కొత్త రాష్ట్రాన్ని డిమాండ్‌ చేయడం లేదని విలీనం కాక ముందు ఉన్న రాష్ట్రాన్ని మాత్రమే కోరుతున్నామన్నారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు ఆటంకంగా లేరని.. ఈ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.