తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేత

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో విద్యార్ధులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ కేసుల ఎత్తివేతకు సంబంధించి 16 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. గత వారంలో కూడా కొన్ని కేసులను ఎత్తి వేసిన విషయం తెలిసిందే.