తెలంగాణ వ్యతిరేకుల సంగతి ప్రజలే చూసుకుంటారు

-కిషన్‌ రెడ్డి
హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలన్న ఎంఐఎం అవిశ్వాస తీర్మానంపై సభకు ఎందుకు హాజరుకాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టాల్సిందేనన్న ఆయన .. అప్పుడే తెలంగాణకు ఎవరు అనుకూలమో ఎవరు వ్యతిరేకమో తేలిపోతుందని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవారి సంగతి ప్రజలే చూసుకుంటారని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ బిల్లు పెడితే రాష్ట్ర సమస్య కనుక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా 160 మంది ఎన్డీఏ ఎంపీల ఎట్లు బిల్లుకు అనుకూలంగా వేయించే బాధ్యత తాను తీసుకుంటాననిక చెప్పారు.