తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ అసమర్థుత, ముందుచూపు లేని కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలకు నిరసనగా సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని  మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.