తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. 8 ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వ బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. రైతు సమస్యలు, భూరికార్డుల ప్రక్షాళనపై ఈరోజు సభలో సమగ్ర చర్చ జరిగింది. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భూరికార్డుల ప్రక్షాళనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.



