తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు తిరుపతిలో ప్రపంచ తెలుగు మహిసభల ముగింపు ఉత్సవాలకు హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11.50 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు విమానంలో సీఎం రేణిగుంట చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రముఖులతో సమావేశం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మహాసభల కార్యక్రమాల్లో పాల్గొంటారు రాత్రికి తిరుపతిలోనే బసచేసి, మరుసటిరోజు ఉదయం 8.50 గంటలకు రేణిగుంటలో విమానంలో బయలు దేరి , ఉదయం 10,10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.