Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > వార్తలు > తెలుగు రాష్ట్రాల్లోఆర్టీసీ సమ్మె ప్రభావం / Posted on May 6, 2015
తెలుగు రాష్ట్రాల్లోఆర్టీసీ సమ్మె ప్రభావం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నామమాత్ర ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జనం సతమతమవుతున్నారు. బస్సులేక బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఉక్కపోత, ఎండవేడిమితో పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె ప్రైవేట్ ట్రావెల్స్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. అధిక ఛార్జీలతో ప్రయాణీకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సికింద్రాబాద్‌లో సెట్విన్ బస్సులు, ఆటోలు, జీపులు జనంతో కిక్కిరిసాయి. వరంగల్ బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. అదనుచూసి ప్రైవేట్ వాహన యజమానులు దోచుకుంటున్నారు.