తెల్ల రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యంతో పాటు ఐదులక్షల బీమా

` కాంగ్రెస్‌ పాలనను తెచ్చుకొని కష్టాలపాలు కావొద్దు
` రైతులను నట్టేట ముంచే కాంగ్రెస్‌ కావాలా? రైతు బంధుఇచ్చే కేసీఆర్‌ కావాలా?
`ఆగం కావద్దు… ఆలోచించి కారు గుర్తుకు ఓటేయాలి
`రైతు బంధును ఆపింది కాంగ్రెస్‌, బీజేపీలే
` ఢల్లీికి వెళ్లే సన్నాసులకు ఓటు వేస్తే మన బతుకులు ఆగం
`  సుల్తానాబాద్‌,హుజురాబాద్‌,పెద్దపల్లి ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌

హుజూరాబాద్‌,సుల్తానాబాద్‌,పెద్దపల్లి(జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్రంలో కంటికి కన్పించే అభివృద్ధి, నేరుగా ఇండ్లలోకి వస్తున్న సంక్షేమ పథకాలను కాదని ఏరికోరి కాంగ్రెస్‌ పాలనను తెచ్చుకొని కష్టాల పాలు కావద్దని, ప్రజలంతా ఆగం కాకుండా ఆలోచించి కారు గుర్తుకు ఓటేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ అన్నారు. సోమవారం మున్సిపల్‌ పరిధిలోని 26వ వార్డు సూపర్‌ బజార్‌ బృందావన్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్డ్డికి మద్దతుగా కేటిఆర్‌ రోడ్‌ నిర్వహించారు. కేటిఆర్‌ రోడ్‌ షో సందర్భంగా తరలివచ్చిన జనంతో గులాబీ జాతరను తలపించింది. రోడ్లో కేటిఆర్‌ మాట్లాడుతూ… నవంబర్‌ 30న జరగుతున్న ఎన్నికలు మూడు రాజకీయ పార్టీల మద్య పోరని, ఓటేసే ముందు ప్రజలంతా ఒక్క సారి ఆలోచించాలని అన్నారు. కరెంట్‌ కావాలా… కాంగ్రెస్‌ కావాలా, కాంగ్రెస్‌ కు ఓటు వేసి కర్ణాటక ప్రజలు చంపలేసుకుంటున్నారని, వందల మందిని బలి తీసుకున్న బలిదేవత సోనియా గాంధీని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చే రైతు బంధును ఆపింది కూడా కాంగ్రెస్‌, బీజేపీలే అని నిప్పులు చెరిగారు. గులుగుడు గులుగుడే… గుద్దుడు గుద్దుడే అన్నట్లు బీఆర్‌ఎసన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని కాల్చి చంపిన దుర్మార్గపు ఘనత కాంగ్రెది అని అన్నారు. బీజేపీవి మాటలు తప్ప అభివృద్ధి, పని చేసే సత్తా లేదన్నారు. రైతు బంధు ఇప్పటికీ 11 సార్లు 70 లక్షల మందికి ఇచ్చిన ఘనత కేసిఆర్జే అన్నారు. రైతులకు రైతు బంధు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తే సానుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బీజేపీలు రైతు బంధు ఇవ్వద్దంటూ లేఖలు రాసి రైతు బంధును ఆపిన దుర్మార్గులని అన్నారు. రైతు బంధు వేస్తే రైతులంతా బీఆర్‌ఎ స్కే ఓటు వేస్తారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కుట్రలు పన్ని రైతు బంధును ఆడ్డుకున్నారని ఆరోపించారు. రైతులకు నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కున్నట్టు చేశారని ఆమె దన వ్యక్తం చేశారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల సన్నాసులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2014కు ముందు తెలంగాణలో కరెంటు కష్టాలు ఎలా ఉండేవో విూరు అర్థం చేసుకోవాలని. అప్పుడు ఎవరైనా చనిపోయినా కానీ స్నానాలు చేసుకునేందుకు కూడా పది నిమిషాల కరెంటు ఇవ్వాలంటూ కరెంట్‌ అధికారులను బ్రతిమిలాడుకునే రోజులు ఉండేనని అన్నారు. ఇప్పుడు తెలంగాణ మొత్తం 24 గంటలకరెంటు ఇస్తూ తెలంగాణలోని ప్రతి ఇంటిలో వెలుగులు నింపుతుందని గుర్తు చేశారు. కరెంటు కావాలో కాంగ్రెస్‌ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టుకున్న కాంగ్రెస్‌ దరిద్రం మళ్ళీ కావాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని చెబుతున్నారని, రైతులకు 10 హెచ్‌ పీ మోటర్‌ పెట్టుకుంటే మూడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతున్నారని అన్నారు. అసలు తెలంగాణలోని ఏ రైతు కైనా 10 హెచ్‌ పీ మోటార్‌ ఉందా అని ఈ దద్దమ్మలకు అది కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఈనెల 30న ఓటు వేసే ముందు ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ కరెంటు ఉండదని, కర్ణాటకలో ప్రజలంతా కాంగ్రెస్‌ ని నమ్మి ఓటేసినందుకు ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు మూడు గంటల కరెంటు, 10 హెచ్‌ పీ మోటర్‌, రైతు బంధు వద్దు, ధరణి రద్దు చేసి మళ్లీ పట్వారి వ్యవసను తీసుకొస్తామని చెబుతున్నారని వీటితో ప్రజలకు ఇబ్బందులే తప్ప ఒరిగేదేవిూ లేదని వీటిపై గట్టిగా ఆలోచించాలని కోరారు. నరేంద్ర మోడీ దన్‌ దన్‌ గా జన్‌ ధన్‌ ఖాతాలు తీయమని చెప్పి 15 లక్షలు వేస్తామని కనీసం 15 రూపాయలు కూడా వేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 15 లక్షలు వేసిన బీజేపీకి ఓటు వేసే పరిస్థితిలో లేరన్నారు. రైతు బంధు, దళిత బంధు లాంటి పథకాలను అమలు చేస్తున్న కేసిఆర్‌ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. దేశంలో అన్ని వస్తువుల పథకాలను అమలు చేస్తున్న కేసిఆర్‌ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. దేశంలో అన్ని వస్తువుల ధరలు అగ్గిమండుతున్నాయని అందుకే ప్రియమై ప్రధానమంత్రి అనడం మానేసి ప్రజలంతా పిరమైన ప్రధానమంత్రి అంటున్నారని అన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలు మార్చిపోతే సెప్టెంబర్‌ రాసుకునే పరీక్షలు కాదని ఐదు సంవత్సరాల మన జీవితాన్ని నిర్దేశించేవని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు తీసుకునేలా చేసిన బలిదేవత సోనియా గాంధీ అని అన్నారు. కేసిఆర్‌ కొత్త మేనిఫెస్టో తయారుచేసి సౌభాగ్య లక్ష్మి పథకం కింద 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు నెలకు 3వేల చొప్పున ఇవ్వనున్నామన్నారు. దీంతో పాటు పెన్షన్‌ కూడా 5వేలకు పెంచుతామని. గ్యాస్‌ సిలిండర్‌ ను కూడా కేవలం 400 కే అందించనున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచనున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం 9 సంవత్సరాలు అవుతుందని కొన్నిట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉండవచ్చని వాటన్నిటిని తప్పక సరి చేసుకుందాం అని అన్నారు. ప్రజలు ఎవరైనా ఇచ్చే వారి విూదే అలుగుతారని అలిగిన గులిగిన మన విూద మనమై ఉండాలన్నారు. హుజురాబాద్‌ లో కౌశిక్‌ రెడ్డిని గెలిపిస్తే హుజురాబాద్‌ కు ఇచ్చిన హావిూలన్నిటిని నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని కేటిఆర్‌ భరోసా ఇచ్చారు. ఇక్కడ కౌశిక్‌ రెడ్డి విూద ఉన్న అభిమానాన్ని చూస్తుంటే ఈ సారి కౌశికెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినట్లుందన్నారు. ఈ రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌. జెడ్పి చైర్పర్సన్‌ కనుమల్ల విజయ,రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌ పర్సన్‌ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య, తాళ్లపల్లి శ్రీనివాస్లతో పాటు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఢల్లీికి వెళ్లే సన్నాసులకు ఓటు వేస్తే మన బతుకులు ఆగం
సుల్తానాబాద్‌:రైతులకు మూడు గంటల కరెంటు చాలు అంటూ రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్‌ పార్టీ కావాలా రైతుబంధు ఇచ్చే కేసీఆర్‌ ప్రభుత్వం కావాలా ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అభివృద్ధి కావాలంటే నిస్వార్థపరుడు మనసున్న మహారాజు దాసరి మనోహర్‌ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. సోమవారం సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని పూసాల రోడ్డు వద్ద జరిగిన కార్నర్‌ సభలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి పెద్దపల్లి బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్‌ రెడ్డి తో కలిసి ప్రసంగించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ మాటిమాటికి ఢల్లీికి వెళ్లి వచ్చే కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే మన బతుకులు ఆగం అవుతాయని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ 55 సంవత్సరాలు పరిపాలించి ఏమి చేసిందని కేటీఆర్‌ ప్రశ్నించారు. వీరోచిత పోరాటాల ద్వారా తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదరించిన పార్టీ బి ఆర్‌ఎస్‌ పార్టీ అని స్పష్టం చేశారు. బిజెపి కాంగ్రెస్‌ పార్టీలు రైతుబంధు నిలిపివేయాలని ఫిర్యాదు చేయడం కుట్రలో భాగమేనని రైతులందరూ ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్‌ తిరిగి హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి కాగానే రైతుబంధు తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయని మహిళలకు వృద్ధాప్య పెన్షన్‌ 5 వేలకు పెంచడం జరుగుతుందని ఇంటిలో మహిళలకు 3000 రూపాయలను అందజేసే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని అన్నారు. నరేంద్ర మోడీ 400 ఉన్న గ్యాస్‌ కనెక్షన్‌ 1200 చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలని రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీద రైతుల బతుకులు ఆగం అవుతాయని 24 గంటలు కరెంటు ఇచ్చే సీఎం కేసీఆర్‌ ను తిరిగి ఆశీర్వదించాలని కోరారు. మన బతుకులు ఆగం చేసిన మన పిల్లల బతుకులు నాశనం అయినాయి అంటే కేవలం కాంగ్రెస్‌ పార్టీతోనేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1200 గ్యాసును తెల్ల రేషన్‌ కార్డు లేని అందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేసి తద్వారా ఐదు లక్షల జీవిత బీమా ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. ఉన్నటువంటి రైతులకు పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి సూచన మేరకు కొలనూర్‌ గర్రెపల్లి పెద్దపల్లి రూరల్‌ ను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని పెద్దపల్లిలో బస్సు డిపో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.పెద్దపల్లి సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందని కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్‌ స్టేషన్‌ మంజూరు చేస్తామని అన్నారు.ఓటమి పాలు అయినా అంటూ అడ్డమైన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని వస్తే మన గొంతు కోస్తారని కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఏది ఏమైనా పెద్దపల్లి నియోజకవర్గంలో హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డిని గెలిపిస్తే సీఎం కేసీఆర్‌ ను గెలిపించినట్లేనని కేటీఆర్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌ నేత ,ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి ,సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌ ,రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్‌ రెడ్డి ,ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు ,మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముత్యం సునీత రమేష్‌ గౌడ్‌ ,మాజీ జిల్లా పరిషత్‌ సభ్యులు గుర్రాల మల్లేశం ఐల రమేష్‌ ,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు వీరఘోని సుజాత రమేష్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుర్ర మౌనిక శ్రీనివాస్‌ గౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ జూపల్లి సందీప్‌ రావు, కౌన్సిలర్లు పారుపల్లి జ్ఞానేశ్వరి ,అనుమాల అరుణ బాపురావు, రేవల్లి తిరుపతి, గొట్టం లక్ష్మి ,గుర్రాల శ్రీనివాస్‌, కూకట్ల గోపి, యూత్‌ మండల అధ్యక్షులు గూడు గుల సతీష్‌, సూర శ్యామ్‌ ,తిప్పారపు దయాకర్‌ ,యువ నేత పురం రమణ, మండల అధ్యక్షులు పురం ప్రేమ్‌ చందర్‌ రావు, యూత్‌ మున్సిపల్‌ అధ్యక్షులు వహీద్‌ ,కార్యదర్శి సతీష్‌ ,కో ఆప్షన్‌ సభ్యులు సాజిత్‌ తో పాటు మహిళలు పార్టీ శ్రేణులు సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కాంపల్లి రాజు మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మహిపాల్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ కోట స్వప్న రామ్‌ రెడ్డి ,తొగర్రాయి సింగిల్‌ విండో చైర్మన్‌ కోట వీణ, రాజ మల్లారెడ్డి, సతీష్‌ రెడ్డి, చిట్టి రెడ్డి, రామ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సన్నబియ్యంతో పాటు ఐదులక్షల బీమా
పెద్దపల్లి:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో రోజు మాత్రమే గడువుండడంతో బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌  సోమవారం పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు కొత్త పథకాలు తీసుకువస్తున్నామని చెప్పారు. ఒకటి సన్నబియ్యం, రెండోది రూ. ఐదు లక్షల కేసీఆర్‌ జీవిత బీమా.. ఈ రెండు పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే అసైన్డు భూములు ఉన్నవారికి మంత్రి శుభవార్త చెప్పారు. డిసెంబర్‌ 3 తర్వాత అసైన్డు భూములు ఉన్నప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి యాజమాన్య హక్కు కల్పిస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణను నాసనం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ అవకాశం ఇస్తే కరెంట్‌ కట్‌ అవుతుందని, రైతు బంధు ఆగిపోతుందని, ప్రజల జీవితాలు నాశనమవుతాయి తప్ప.. ఆ పార్టీవల్ల ఏవిూకాదని మంత్రి కేటీఆర్‌ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. పొరపాటున కూడా కాంగ్రెస్‌ను నమ్మొద్దన్నారు. అదీ.. ఇదీ గ్యారంటీ అంటూ కాంగ్రెస్‌ వాళ్లు చెబుతున్నారని, వాళ్ల సీఎం సీటుకే గ్యారంటీలేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఆరు నెలలకొకసారి ముఖ్యమంత్రులు మారడం గ్యారంటీ అని అన్నారు. రైతు బంధు ఆపిన పార్టీకి ఓటేస్తారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.