థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌

హైదరాబాద్‌ : థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీ పైనల్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌ బురనప్రసెర్‌టస్క్‌పై 24-12,21-11తో సైనా సునాయాస విజయం సాధించింది. సైనా దాటికి రెండు సెట్లలో పోరు ఏకపక్షమే అయింది.ఫైనల్‌ సైనా చైనా క్రీడాకారిణి లిన్‌వాంగ్‌తో తలపడనుంది. అంతకు ముందు ఉదయం జరిగిన మరో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి రాచ్‌నాక్‌ ఇంతనన్‌పై  లిన్‌ వాంగ్‌ 21-13, 21-19 తేడాతో గెలుపొందింది. కాగా, లండన్‌ ఒలంపిక్స్‌కు ముందు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరడం సైనా నెహ్వాల్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది.