దళితబంధు పథకం అమలు పై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం :
దళితబంధు పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి పథకాన్ని వర్తింపచేసిన నేపథ్యంలో..
ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని…ఇందులో భాగంగా మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 500 మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి పథకం వర్తింప చేయాలని కేబినెట్ తీర్మానించింది.