దళితుల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం…
ఖానాపురంలో 50 దళిత కుటుంబాలు పార్టీలో చేరిక..
. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్…
అనంతగిరి,జనంసాక్షి:
దళితుల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలోని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గింజపల్లి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 దళిత కుటుంబాలు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత సోదరులకు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కార్యకర్తలు, నాయకులు పార్టీలోకి చేరుతున్నారన్నారు. దళితులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. నిరుపేద కుటుంబాలకు తప్పనిసరిగా దళిత బంధు పథకం అందుతుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మహిళలతో బతుకమ్మ ఆడి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జొన్నగడ్డ శ్రీనివాసరావు ,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మర్రి సంతోష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area
|