దళితుల సమస్యలపై నేడు ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ
అనంతపురం,ఫిబ్రవరి17( (జనంసాక్షి) ): ఎస్సీ,ఎస్టీల సమస్యలపై జిల్లా అధికారులు ప్రత్యేక ఫిర్యాదులు తీసుకోబోతున్నారు. ఈనెల 18న బుధవారం లెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఉదయం 10 గంటలకు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అడిషనల్ జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ గ్రీవెన్స్‌కు కలెక్టర్ కోనశశిధర్, జేసీ లక్ష్మీకాంతం,ఇతర జిల్లా అధికారులు హాజరవుతారు. అందువల్ల జిల్లాలోని దళితులు,గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇదిలావుంటే ఆంధప్రదేశ్ సర్వే మినిస్టీరియల్, అఫీసు సబార్డినేట్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా సర్వేశాఖ సీనియర్ సహాయకుడు ఎం.నాగార్జునరావు ఎన్నికయ్యారు. గుంటూరులో రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. నాగార్జునరావు ఎన్నిక పట్ల జిల్లా సర్వే, భూరికార్డులశాఖ సహాయ సంచాలకులు మశ్చీంద్రనాథ్, కార్యాలయ సూపరింటెండెంటు పద్మోజీరావు, జోనల్ అధ్యక్షుడు నందానాయక్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అధికారులు, ఉద్యోగులు నాగార్జునరావును అభినందించారు.