ప్రణబ్‌కు లైన్‌ క్లీయర్‌ నామినేషన్‌ ఆమోదం

ఢిల్లీ: యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ నామినేషన్‌ చెల్లదంటూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పి.ఏ. సంగ్మా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికల రీటర్నింగ్‌ అధికారులు క్షుణ్ణంగా దాదా నామినేషన్‌ను పరిశీలించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దాదా అర్హుడని ఎన్నికల అధికారి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.   . దీనితో దాదాకు లైన్‌ క్లీయర్‌ అయింది యుపీఏ నాయకులకు, మద్దతుదారులకు  ఊరట లభించింది.