దానంపై కేసు పెట్టాలని ఆందోళన
హైదరాబాద్: మంత్రి దానం నాగేందర్‌పై కేసు పెట్టాలంటూ తెలంగాణ న్యాయవాదుల ఆందోలనకు దిగారు. నాంపల్లి కోర్టు, పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. నిన్న తెలంగాణవాదులపై దానం తన అనుచరులతో దాడికి దిగారని, వెంటనే ఆయనపై కేసుపెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.