దేవాలయ భూముల కౌలు బహిరంగ వేలములు

హుజూర్ నగర్ మే 25 (జనంసాక్షి): మండలంలోని లింగగిరి గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి చెందిన వ్యవసాయ భూములు విస్తీర్ణం 28-38 లను 2023-24 సంవత్సరమునకు కౌలుకు ఇచ్చుటకు బహిరంగ వేలము నిర్వహించగా 8,05,000/- ఆదాయము వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి గుజ్జుల కొండారెడ్డి గురువారం తెలిపారు. గత సంవత్సరము ఈ భూమికి కౌలు 6,52,000/- ఆదాయము వచ్చినది. గత సంవత్సరము కంటే 1,53,000/- లు ఆదాయము పెరిగినది. ఈ వేలంలో గ్రామ సర్పంచ్ కర్నాటి అంజిరెడ్డి, దేవాలయ చైర్మన్ భిక్షమాచారి, ఆలయ అర్చకుడు దామోదరాచార్యులు, రాఘవయ్య, కిరణ్ కుమార్, నాగేంద్రబాబు, రాజు, రమేష్, శ్రీను, పాటదారులు పాల్గొన్నారు.