దేశ రాజధానిలో పటిష్ఠ బందోబస్తు

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దిన వేడుకలకు దేశ రాజధానిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ఇక్కడి ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ దాదాపు 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైలికాప్టర్లలో గగనతల గస్తీ కూడా నిర్వహిస్తున్నారు.