దోమల నివారణ చర్యలు జరిగేనా …?
హైదరాబాద్, నవంబర్ 21: దోమల నివారణకు ఆరు వారాల్లోగా పూర్తి చర్యలు చేపట్టాలని హైకోర్టు జీహెచ్‌ఎంసీకి ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేనా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. నగరంలో గతంతో పోలిస్తే పారిశుద్ధ్యంపై శ్రద్ద తగ్గింది. పన్నుల వసూళ్లలో చూపుతున్న శ్రద్ధ పారిశుద్యలో తీసుకోకపోవడంతో నగరంలో దోమలు పెరిగి విషజ్వరాలు బారిన పడుతున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఫలితంగా జంటనగరాల్లోని ఎక్కడ మురికినీరు అక్కడే నిల్వఉండి దోమలు వృద్ది చెందుతున్నాయి. దోమల నివారణకు వినియోగించే పోర్టబుల్ మిషన్లు జీహెచ్‌ఎంసీ వద్ద 141 ఉంటే వాటిలో 58మాత్రమే పనిచేసే స్థితిలో ఉన్నాయి.వాహనాలపైతిప్పే యంత్రాలు 5 ఉంటే మూడు పనిచేస్తున్నాయి. పవర్ స్పేయ్రర్లు 11 ఉంటే 8 పనిచేస్తున్నాయి. నాప్‌సాక్ స్పేయ్రర్లు 716 ఉంటే వాటిలో 120 మాత్రమే పనిచేసే స్థితిలో ఉన్నాయని అధికారులే స్పష్టం చేస్తున్నారని తెలిపారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజారోగ్యంపై తీసుకుంటున్న శ్రద్ధ ఏమిటో తెలుస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు. దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాని ఆదేశించింది. పనిచేయకుండా మొరాయించిన యంత్రాలకు ఆరువారాల్లోకి మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తేవాలని, దీనిపై స్థాయీ నివేదికను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని దేశించింది.



