ధర్మపురి క్షేత్రలో పోటెత్తిన భక్తజనం

ధర్మపురి : శ్రావణ శుక్రవారం సందార్బంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కరీంనగర్‌ జిల్లా ధర్మపురి గోదావరి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిద ప్రాంతాలనుండి తరలివచ్చిన భక్తులు గోదవరిలో పుణ్యస్థానాలు ఆచారించారు. నదీతీరాన సంతోషిమాత ఆలయంలో మహిళలు వరలక్ష్మి వ్రత పూజాలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. నదిలో నీటి మట్టం పెరగడం, మరోవైపు వసతులు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.