ధర్మానకు సంఘీభావం ప్రకటిస్తున్న పలువురు నేతలు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావును ఆయన నివాసంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి సంఘీభావం ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్న ఆయనను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పార్థసారధి, కొండ్రు మురళి, తోట నరసింహవ తదితరులు నియోజకవర్గం నుంచి వందలుగా తరలివస్తున్న కార్యకర్తలతో మంత్రుల నివాస సముదాయం నిండిపోతోంది. వీరితో  పాటు పలువురు ఎమ్మెల్యేలు ధర్మానను కలిసి మద్దతు ఉంటుందని ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు ధర్మాన రాజీనామాపై ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.