ధానేశ్వరి అమ్మవారికి స్వర్ణకిరీటం బహుకరణ

తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో కొలువుదీరిని ధానేశ్వరి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు స్వర్ణకిరీటాన్ని మంగళవారం బహుకరించారు. 574 గ్రాముల ఈ స్వర్ణకిరీటం రూ. 28 లక్షలు విలువచేస్తుంది. గునుపూడి వర్మ కుటుంబీకులు ఈ కిరీటాన్ని ఆలయ కార్యనిర్వాహణ అధికారి షణ్ముగంకు అందజేశారు. గతంలో వీరే అమ్మవారికి 600 గ్రాముల బంగారు ఆభరణాలను నిర్వాలంకరణ నిమిత్తం బహుకరించారు.