నకిలీనోట్లు తరలిస్తున్న 7గురి అరెస్ట్‌

నల్గొండ: జిల్లాలోని కోదాడ వద్ద నకిలీనోట్లు తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్స్‌ వద్ద వహనాలు తనిఖీ చేస్తుడగా అనుమానాస్పదంగా కనిపించిన వారి వాహనాలను తనిఖీ చేయగా 1.90 లక్షల దొగనోట్లు బయటపడ్డాయి. వీటిని తరలిస్తున్న 7గురు వ్యక్తులను అరెస్టుచేసి వారినుంచి 3 కత్తులు, ఓ స్కానర్‌, ప్రింటర్‌, సీపీయూను స్వాధీనం చేసుకున్నారు.