నకిలీ మావోయిస్టుల అరెస్టు

 

హైదరాబాద్‌ : మావోయిస్టులమని చెప్పి స్థానిక వ్యాపారిని డబ్బుల కోసం బెదిరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలిసులు అరెస్టుచేశారు. కోద్దిరోజుల నుంచి అ వ్యాపారిని డబ్బులివ్వకపోతే చంపుతామని వారు బెదిరిస్తున్నారు. అయన ఫిర్యాదుతో ఎన్‌అర్‌నగర్‌ పోలిసులు వారిని అరెస్టు చేశారు.