నగరంలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు

KTR-SERVEY-01-650x345

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సోమవారం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీలో రోడ్ల దుస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రోడ్ల పనుల వేగం పెంచాలని ఆదేశించారు.

ఆరు మాసాలుగా నత్తనడకన రోడ్డు పనులు సాగుతున్నాయని మంత్రికి స్థానికులు విన్నవించుకున్నారు. మంత్రి వెంట మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక కార్పొరేటర్ కవిత ఉన్నారు. అలాగే స్తంభాలపై అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని ఆయన సూచించారు.