నగరంలో పర్యటించిన మేయర్

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. నగరంలోని కొత్తగూడ, కొండాపూర్‌ ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని ఆయన పరిశీలించారు. సదరు ప్రాంతంలో ట్రాఫిక్, రహదారి పరిస్థితిని ఆయన వెంట ఉన్న ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే, కేబీఆర్ పార్కు వద్ద వన్‌వే ఏర్పాటుపై కూడా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు మేయర్ బొంతు రామ్మోహన్ పలు సూచనలు చేశారు.