నగరంలో భారీ భద్రత

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలో నేడు తెలంగాణవాదులు సమరదీక్ష, రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణపై రోడ్డు మ్యాపును విడుదల చేయాలంటూ రాజకీయ ఐకాస ఇందిరా పార్కు వద్ద సమరదీక్షన చేపట్టనుంది. మరోవైపు విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు నగరంలోని పలుచోట్ల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధాన కూడళ్ల వద్ద బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ఓయూ ఎన్‌సీసీ గేటు, ఇందిరాపార్కు, అసెంబ్లీ,గన్‌పార్కు , సచివాలయం, రాజ్‌భవన్‌ ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

తాజావార్తలు